ఒంగోలు అర్బన్: ఒంగోలు భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందుతుందని వెల్లడించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు
Ongole Urban, Prakasam | Sep 13, 2026
ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలు ఏర్పడి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అంచలంచెలుగా ఒంగోలు ఎదిగిన తీరును ఆయన గుర్తు చేసుకున్నారు. పట్టణంలో మౌలిక సదుపాయాలు కల్పనకు రోడ్లు మరమ్మత్తులు రోడ్లు విస్తరణ డ్రైనేజీ వ్యవస్థ మాలిక సదుపాయాలు వంటి అంశాలపై దృష్టి పెట్టామన్నారు. భవిష్యత్తులో ఒంగోలు మరింత అభివృద్ధి చెందుతుందని కూటమి ప్రభుత్వం అందుకు కట్టుబడి ఉందని ఎమ్మెల్యే వెల్లడించారు.