శ్రీశైలం: శ్రీశైల దేవస్థాన దత్తత దేవాలయమైన కొలను భారతి ఆలయ అభివృద్ధిపై సమీక్ష సమావేశం
శ్రీశైల దేవస్థాన దత్తత దేవాలయమైన కొలను భారతి ఆలయ అభివృద్ధిపై ఈ రోజు శనివారం కొలనుభారతీక్షేత్రంలో సమీక్షా సమావేశం నిర్వహించబడింది. నందికొట్కూరు శాసనసభ్యులు గిత్తా జయసూర్య ఆధ్వర్యంలో ఈ సమీక్షా సమావేశం ఏర్పాటు చేయబడింది. ఈ సమీక్షా సమావేశంలో గౌరవ శాసనసభ్యులు ఆలయ అభివృద్ధికి వనరులు, ఆలయానికి రాబడి, అభివృద్ధికి దాతల సహకారం, భక్తులకు మౌలిక సదుపాయాల కల్పన, రవాణా సౌకర్యాలపై మాట్లాడారు. ఇంకా వారు మాట్లాడుతూ నల్లమల అడవుల్లో పవిత్ర క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీశైలదేవస్థానం కొలనుభారతీ ఆలయాన్ని దత్తత తీసుకోవడంతోనే ఆలయానికి మహర్దశ పట్టిందని అన్నారు.