పాయకరావుపేట: అనకాపల్లిలో ఘోర ప్రమాదం: విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు, ఇద్దరు మృతి
అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం రేవుపోలవరం వద్ద జరిగిన కారు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. సముద్ర స్నానానికి వెళ్లి వస్తుండగా విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. నలుగురు గాయపడగా, వారిని అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.