రాజమండ్రి సిటీ: అధ్యయన యాత్రకు బయలుదేరిన ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ అధికారులు
రాజమహేంద్రవరం అటవీ అకాడమీకి చెందిన 58 మంది అధికారులు రెండు బృందాలుగా వారం రోజుల పాటు అధ్యయన యాత్రకు బయలుదేరారు. నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ తో పాటు తూర్పు కనుమల్లోని పలు ప్రాంతాల్లో అటవీ నిర్వహణ పద్ధతులను వీరు అధ్యయనం చేయనున్నారు.