కూసుమంచి: ఖమ్మంలో బీఆర్ఎస్ వినూత్న నిరసన: ఆరు గ్యారంటీల అమలు కోసం అంబేద్కర్ విగ్రహానికి వినతి
ఖమ్మం రూరల్ లో ఆరు గ్యారంటీల అమలు కోరుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేయడంతో పాటు, సూర్యాపేట రహదారిపై రాస్తారోకో నిర్వహించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై ఉన్న కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.