గజ్వేల్: సెప్టెంబర్ 10న 'చలో హైదరాబాద్': గజ్వేల్ ఉద్యోగ సంఘాల పిలుపు
ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 10న హైదరాబాద్లో జరగనున్న ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గజ్వేల్ టీఎన్జీవో నేతలు పిలుపునిచ్చారు. పీఆర్సీ, పెండింగ్ డీఏలు, సీపీఎస్ రద్దు వంటి పలు డిమాండ్లపై ఈ నిరసన చేపట్టనున్నారు.