కనిగిరి: పామూరు మండలం రఘునాధపురం గ్రామంలో మేలు జాతి లేగ దూడల ప్రదర్శన కార్యక్రమం
పామూరు మండలంలోని రఘునాథపురం గ్రామంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ మరియు రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మేలు జాతి లేగ దూడల ప్రదర్శన కార్యక్రమాన్ని సోమవారం అధికారులు నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర టిడిపి విభిన్న ప్రతిభావంతుల ప్రధాన కార్యదర్శి అడుసుమల్లి ప్రభాకర్ చౌదరి మాట్లాడుతూ... మేలు జాతి లేగ దూడల ప్రదర్శన కార్యక్రమం వెనుకబడిన పామూరు మండలం రఘునాథపురం గ్రామంలో నిర్వహించడం అభినందన ఏమన్నారు. ఈ సందర్భంగా అందమైన మేలు జాతి లేక దూడలకు పశుసంవర్ధక శాఖ అధికారులు బహుమతి ప్రధానం చేశారు