దర్శి: సైనిక సహాయార్థం పీఎం సహాయ నిధికి లక్ష రూపాయలు విరాళం ప్రకటించిన దర్శి టిడిపి ఇన్చార్జి లక్ష్మి
Darsi, Prakasam | May 11, 2025 దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి ఆదివారం ప్రధానమంత్రి సహాయ నిధికి సైనికుల సహాయార్థం లక్ష రూపాయలను విరాళంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బార్డర్లో సైనికులు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కాపలా కాస్తున్నడంతోనే మనము ప్రశాంతంగా జీవిస్తున్నామని అలాంటి సైనికుల కోసం తన వంతు సహాయంగా లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని పీఎం సహాయనిధికి అందజేస్తున్నట్లు ఆమె తెలిపారు.