మానకొండూరు: బాగులో పడిన మతిస్థిమితం లేని వ్యక్తి.. ప్రాణాలు కాపాడిన స్థానికులు..
వాగులో పడిన మతిస్థిమితం లేని వ్యక్తి కరీంనగర్ జిల్లాలో నిన్న కురిసిన భారీ వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని అరకండ్ల వాగులో నీటి ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అరకండ్లకు రాకపోకలు నిలిచిపోగా కొందరు సాహసం చేసి వాగు దాటే ప్రయత్నం చేస్తున్నారు. మంగళవారం మద్య్హనం ఈ క్రమంలో ఓ మతిస్థిమితం లేని వ్యక్తి వాగు దాటుతుండగా వరద ప్రవాహం పెరిగి నీటిలో కొట్టుకుపోయాడు. గమనించిన స్థానికులు సదరు వ్యక్తిని కాపాడటంతో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. హై లెవెల్ బ్రిడ్జిని నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.