పిఠాపురం: గొల్లప్రోలులో అర్ధరాత్రి ఘర్షణ.. పాత కక్షలతో ఉలిక్కిపడ్డ కాలనీ
గొల్లప్రోలులో పాత కక్షల నేపథ్యంలో నిందితుడి ఇంటిపై బాధితుడి బంధువులు దాడికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. నాలుగు నెలల క్రితం జరిగిన హత్య కేసులో నిందితుడి తల్లిదండ్రులు ఇంటికి తిరిగి రావడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.