వికారాబాద్: జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో స్టిపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ శిక్షణ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎస్పీ
వికారాబాద్ జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో ఏఆర్ ఎస్‌సీటీపీసీఎస్ స్టిపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ 9నెలల శిక్షణ ప్రారంభోత్సవంలో ఎస్పీ కోటిరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఏఆర్ ట్రైనీ కానిస్టేబుల్‌లో నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవాలని అభ్యర్థులకు సూచించారు. 2024వ బ్యాచ్‌లో ఆసిఫాబాద్ నుంచి 55మంది, రామగుండం 109, సిద్దిపేట నుంచి 60మంది మొత్తం 224మంది అభ్యర్థులు శిక్షణ పొందనున్నట్లు ఆయన వెల్లడించారు.