సిరిసిల్ల: కరీంనగర్ లో దీక్షా దివస్ స్ఫూర్తి సభ: ఇంటింటి ప్రచారం నిర్వహించిన నాయకులు
కరీంనగర్ అలుగునూర్ లో ఈనెల 29న జరగనున్న దీక్షా దివస్ స్ఫూర్తి సభ కోసం మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను గుర్తు చేస్తూ ప్రజలను సభకు ఆహ్వానించారు.