శ్రీశైలం: శ్రీశైల జలాశయానికి మళ్లీ స్వల్పంగా ప్రారంభమైన వరద ప్రవాహం
శ్రీశైల జలాశయానికి జూరాల ప్రాజెక్టు నుంచి మళ్లీ స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతోంది. గురువారం సాయంత్రం 6 గంటలకు జూరాల నుంచి 5,588 క్యూసెక్కుల వరద నీరు వచ్చి శ్రీశైలానికి చేరగా, భూగర్భవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 35,315 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం డ్యామ్ నీటిమట్టం 866.30 అడుగులు, జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు ,నీటి నిల్వ సామర్థ్యం 127.2834 టీఎంసీలుగా నమోదైంది.