శ్రీశైలం: శ్రీశైల దేవస్థాన ట్రస్ట్ బోర్డు పదవికి రాజీనామా చేసిన బోనేని రవణమ్మ
శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మహిళా సభ్యురాలు బోనేని రమణమ్మ తన పదవికి రాజీనామా చేశారు. గత నెల 28వ తేదీన తన రాజీనామా లేఖను ట్రస్ట్ బోర్డు చైర్మన్తో పాటు దేవస్థానం ఈవోకు అందజేశారు. మార్కాపురం జిల్లా పరిధిలో మరో రాజకీయ పదవి కోసం ఆమె నామినేషన్ దాఖలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె ట్రస్ట్ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కాగా, రమణమ్మ సమర్పించిన రాజీనామాను ఆమోదిస్తూ దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి కన్నబాబు నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. రమణమ్మ మార్కాపురం జిల్లా కొమరోలు గ్రామానికి చెందినవారిగా సమాచారం.