శ్రీశైలం: శ్రీశైలం పాతాళగంగలో విషాద ఘటన, ముంబై కి చెందిన ఇద్దరు భక్తులు గల్లంతు
శ్రీశైలం జలాశయంలోని పాతాళగంగలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్నానానికి నీటిలో దిగిన ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. గల్లంతైన వారు ముంబైకి చెందిన భక్తులుగా పోలీసులు గుర్తించారు. పాతాళగంగలో లోతు తెలియక నీటిలోకి దిగిన సమయంలో ప్రమాదవశాత్తు జారిపడి ఇద్దరూ గల్లంతైనట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు మత్స్యకారుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టి గల్లంతైన ఇద్దరినీ బయటకు తీశారు. అయితే ఇద్దరిలో ఒకరు మృతి చెందగా, మరో వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ఘటనతో పాతాళగంగ వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి.