బోనకల్: ఈ నెల 25న బాబన్న సంస్మరణ సభ: జయప్రదం చేయాలని పిలుపు
ప్రజా కళాకారుడు బాబన్న సంస్మరణ సభను ఈ నెల 25న కొత్తగూడెంలో నిర్వహించనున్నారు. ఈ సభను విజయవంతం చేయాలని ప్రజానాట్య మండలి జిల్లా బాధ్యులు నామా లక్ష్మీనారాయణ, వేముల సదానంద్ కోరారు. నేలకొండపల్లిలో జరిగిన పాలేరు డివిజన్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.