శ్రీశైలం: శ్రీశైల దేవస్థానంలో ఘనంగా 80 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.
శ్రీశైలం దేవస్థానంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా భారీ జాతీయ జెండాను చేతబట్టి శ్రీశైలం పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఈవో శ్రీనివాసరావు చైర్మన్ రమేష్ నాయుడు ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కళాకారుల నృత్యాలు అందర్నీ ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో వేద పండితులు వేద విద్యార్థుల వేదపారాయణం నిర్వహించారు.