గుంతకల్లు: గుత్తి పట్టణ శివారులోని నేసే వీధి సమీపంలో పొలంలో చెట్టు గురు వేసుకుని గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
గుత్తి పట్టణ శివారులోని నూతన నేసే వీధి సమీపంలో ఉన్న గుట్ట పక్కన నారాయణస్వామి పొలంలో వేప చెట్టుకు గుర్తుతెలియని వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ సురేష్, ఏఎస్ఐ నూర్ పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుని వివరాల కోసం ఆరా తీస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులు లోతుగా విచారణ, దర్యాప్తు చేపట్టారు.