శ్రీశైలం: ఆత్మకూరు పట్టణంలో ఘనంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం. పాల్గోన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు
ఆత్మకూరు పట్టణంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు భారీ జాతీయ జెండాను ప్రదర్శిస్తూ దేశభక్తిని చాటుకున్నారు.పట్టణంలోని నంద్యాల టర్నింగ్ నుంచి గౌడ్ సెంటర్ వరకు తిరంగా ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు “భారత్ మాతాకీ జై”, “వందేమాతరం” అంటూ నినాదాలు చేశారు. దేశభక్తి గీతాల నడుమ జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని గౌడ్ సెంటర్లో విద్యార్థులతో మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో చిన్నారుల వేషధారణ జాతీయ జెండాల రంగులతో దుస్తులు ధరించి ర్యాలీ నిర్వహించారు