కొండపి: కొండేపి నియోజకవర్గంలో భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే వేడుకలు నిర్వహించిన క్రైస్తవులు
కొండేపి, మర్రిపూడి,పొన్నలూరు మండలాలలో గుడ్ ఫ్రైడేని పురస్కరించుకొని శుక్రవారం క్రైస్తవులు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మండల కేంద్రమైన పొన్నలూరు తెలుగు బాప్టిస్ట్ చర్చిలో రెవరెండ్ పాస్టర్ ప్రభాకర్ గుడ్ ఫ్రైడే సందేశాన్ని అందించారు. గుడ్ ఫ్రైడే ప్రేమ, కరుణ, శాంతికి చిహ్నం అన్నారు. క్రీస్తు మార్గాన్ని అనుసరించాలన్నారు.