శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో నవంబర్ 10 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు కార్తీకమాసోత్సవాలు
శ్రీశైల మహాక్షేత్రంలో నవంబర్ 10 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు కార్తీకమాసోత్సవాలు నిర్వహించనున్నట్లు చైర్మన్ పోతుగంటి రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు తెలిపారు. కార్తీకమాసం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం, వసతి, మంచినీటి సరఫరా, క్యూలైన్లు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్యంపై ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి సందర్భంగా పుష్కరిణి హారతి, లక్షదీపోత్సవం, జ్వాలాతోరణోత్సవం నిర్వహించనున్నారు. నవంబర్ 13న కృష్ణమ్మ హారతి, నవంబర్ 20న కోటి దీపోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.