నవీపేట్: నిజామాబాద్ రైతులకు శుభవార్త: అలీసాగర్ నుంచి సాగునీరు విడుదల
నిజామాబాద్ జిల్లాలో ఖరీఫ్ సాగు కోసం అలీసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని విడుదల చేశారు. 6 మండలాల్లోని 53,793 ఎకరాల ఆయకట్టుకు 10 రోజుల పాటు 540 క్యూసెక్కుల నీరు అందనుంది. నీటిని పొదుపుగా వాడుకోవాలని రైతులకు నేతలు సూచించారు.