ఆలేరు: జులై 7న ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి: మహేందర్ మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి
Alair, Yadadri | Jun 15, 2025 యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రం వైఎస్ఎన్ ఫంక్షన్ హాల్ లో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి ముఖ్య కార్యకర్తల సమావేశం ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు నల్లచంద్రస్వామి మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిర్రు మహేందర్ మాదిగ ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి యాదాద్రి జి భువనగిరి జిల్లా ఇన్చార్జి హాజరై మాట్లాడుతూ 78 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో 30 ఏళ్లుగా సజీవంగా నిలబడి లక్ష్యాన్ని ముద్దాడిన ఏకైక సామాజిక ఉద్యమం ఎమ్మార్పీఎస్ మాత్రమే అని అన్నారు. జూలై 7న ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని అన్నారు.