కళ్యాణదుర్గం: రాళ్ల అనంతపురంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన ఎమ్మెల్యే సురేంద్రబాబు
కంబదూరు మండలం రాళ్ల అనంతపురం గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థులతో కలిసి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు భోజనం చేశారు. విద్యార్థులతో ముచ్చటించారు. తమతో కలిసి ఎమ్మెల్యే భోజనం చేయడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే స్వయంగా తాను భోజనం చేసిన ప్లేటును శుభ్రం చేశారు.