రాప్తాడు: బండమీదపల్లి గ్రామపంచాయతీలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న రాప్తాడు ఎంపీడీవో విజయలక్ష్మి
అనంతపురం జిల్లా రాప్తాడు మండలం బండమీద పల్లి గ్రామపంచాయతీ నందు శనివారం 11:30 నుంచి 2:00 వరకు నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమంలో ఎంపీడీవో విజయలక్ష్మి పాల్గొని. ఈ సందర్భంగా ఎంపీడీవో విజయలక్ష్మి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా బండమీద పల్లి పంచాయతీలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తడి చెత్త పొడి చెత్త వేరుగా పారిసిద్ద కార్మికులకు ఇవ్వాలని గ్రామం పరిశుభ్రంగా ఉండేందుకు ప్రజల సహకారం అందించాలని ప్రభుత్వం చేపడుతున్న స్వర్ణాంధ్ర స్వచ్ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలకు పరిసరాలు గురించి అవగాహన కల్పించామని ఎంపీడీవో విజయలక్ష్మి పేర్కొన్నారు.