రఘునాథపాలెం: రఘునాథపాలెం గురుకుల పాఠశాలలో విషాదం: ఆటలాడుతూ కుప్పకూలిన ఎనిమిదో తరగతి విద్యార్థి సాత్విక్
రఘునాథపాలెం మహాత్మ జ్యోతిబా ఫూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్థి సాత్విక్ ఆటలాడుతుండగా మృతి చెందాడు. గుండెపోటు కారణంగానే బాలుడు మృతి చెంది ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో కాకరవాయి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.