జడ్చర్ల: వర్షాకాలం వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోండి:జిల్లాకలెక్టర్ విజయేందిర బోయి
జడ్చర్లలో ఇటీవల డెంగీ కేసులు నమోదైన సందర్భంగా కలెక్టర్ విజయేందిర శుక్రవారం బోయి పట్టణంలోని 14,6,3వ వార్డుల్లో పర్యటించారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని రికార్డులు తనిఖీ చేశారు. వర్షాకాలం సందర్భంగా వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని శానిటేషన్ సిబ్బందికి సూచించారు. రోగులకు వైద్యులు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పారు.