కనిగిరి: చిన్న ముప్పాళ్ళపాడు, మంగంపల్లి దళిత వాడల పాఠశాలలను హైస్కూల్లో విలీనం చేయడానికి నిరసిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రుల ధర్న
హనుమంతునిపాడు మండలంలోని చిన్న ముప్పలపాడు, మంగంపల్లి గ్రామాల్లోని దళితవాడలో ఉన్న ప్రాథమిక పాఠశాలలను మూడు కిలోమీటర్ల దూరం ఉండే హైస్కూల్లో విలీనం చేయడానికి నేర్శిస్తూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గురువారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... పేదలను దూరం చేసేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయన్నారు. చిన్న ముప్పలపాడు, మంగంపల్లి గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలలను దూరంగా ఉండే హైస్కూల్లో విలీన నిర్ణయాన్ని ప్రభుత్వం పునరాలోచించాలన్నారు..