కర్నూలు: కర్నూలు జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల: నవంబర్ 26న పోలింగ్
కర్నూలు జిల్లాలో గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. నవంబర్ 15 నుంచి 17 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 26న పోలింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ప్రకటించారు. పోలింగ్ కేంద్రాల్లో పారదర్శకత కోసం సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు.