శ్రీశైలం: నంద్యాల జిల్లా మొదటి జడ్పీ చైర్మన్ రేసులో వెలుగోడు ZPTC గుండం రమణారెడ్డి
నంద్యాల జిల్లా మొదటి జడ్పీ చైర్మన్ రేస్ లో వెలుగోడు కు ZPTC మెంబర్ గుండం రమణారెడ్డి ఉన్నట్లు తెలుస్తుంది. నందికొట్కూరు నియోజకవర్గం లోని వెలుగోడులో జడ్పిటిసిగా పోటీ చేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక ఎమ్మెల్యే ఆశీస్సులు, మంత్రి బిసి, మరియు నందికొట్కూరు ఇతర ఎమ్మెల్యేల ఆశీస్సులు ఉండడంతో వెలుగోడు జడ్పి చైర్మన్ పేరు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తుంది.అయితే జడ్పీ చైర్మన్ రేస్ లో మరికొందరు జడ్పిటిసిలు ఉండి వారి ప్రయత్నం వారు చేస్తున్నట్లు తెలుస్తుంది. అందరి ఆశీస్సులు ఉండి అధిష్టానం ఆదేశిస్తే నంద్యాల జిల్లా తొలి జడ్పీ చైర్మన్ గుండం రమణారెడ్డి ఎన్నికయ్యే అవకాశం ఉంది.