రాప్తాడు: ఇటికలపల్లిలో శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయంలో నూతన ఉపకులపతిగా పదవీ బాధ్యతలు తీసుకున్న ప్రొఫెసర్ జ్యోతి కుమార్
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని ఇటికలపల్లి వద్ద ఉన్న శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయంలో శనివారం 11 10 నిమిషాల సమయంలో నూతన ఉపకులపతిగా ఎన్విఆర్ జ్యోతి కుమార్ పదవి బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా నూతన ఉపకులపతి జ్యోతి కుమార్ మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లు నాన్ టీచింగ్ ఇతర సిబ్బంది అంతా కలుపుకుని యూనివర్సిటీని మరింత అభివృద్ధి చేస్తామని నూతన ఉపకులపతిగా పదవి బాధ్యతలు చేపట్టిన ఎన్.వి.ఆర్ జ్యోతి కుమార్ పేర్కొన్నారు. అదేవిధంగా ఉద్యోగులంతా ఉపకులుపతి జ్యోతి కుమార్ కు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు చెప్పారు.