కోదాడ: రాష్ట్ర ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా కోదాడ ఎంఈవో సలీం షరీఫ్
కోదాడ ఎంఈవో మహమ్మద్ సలీం షరీఫ్‌కు రాష్ట్ర ఉత్తమ ప్రధానోపాధ్యాయ పురస్కారం లభించింది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్న ఆయనను, కాంగ్రెస్ నాయకులు గుండెపంగు రమేష్ సన్మానించారు. విద్యా రంగంలో సలీం షరీఫ్ అందించిన 30 ఏళ్ల సేవలకు గాను ఈ గౌరవం దక్కింది.