దర్శి: కురిచేడులో క్రీడా మైదానానికి అవకాశం కల్పించాలని దర్శి ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి ని కోరిన క్రీడాకారుడు
Darsi, Prakasam | Apr 25, 2025 కురిచేడులోని వైఎస్సార్ జిల్లా పరిషత్ హై స్కూల్లో క్రీడలు ఆడుకునేందుకు అవకాశం కల్పించాలని దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని శుక్రవారం క్రీడాకారులు కోరారు. ఇక్కడున్న బాలిక హాస్టల్ను వేరే ప్లేస్లో నిర్మించాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించారు. అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు యువకులు, నాయకులు పాల్గొన్నారు.