పెద్దవూర: నల్గొండలో 15న భారీ రైతు బహిరంగ సభ: జయప్రదం చేయాలని పిలుపు
అఖిల భారత రైతు సంఘం 36వ జాతీయ మహాసభల సందర్భంగా ఈ నెల 15న నల్గొండ ఎన్జీ కాలేజీ గ్రౌండ్లో బహిరంగ సభ జరగనుంది. కేంద్ర ప్రభుత్వ విధానాలపై పోరాడేందుకు ఈ సభను నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు చిన్నపాక లక్ష్మీనారాయణ తెలిపారు. 14 నుండి 16 వరకు అగ్రి షో మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.