కొండపి: కొండపిలో మే 19న జరిగే కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలి: ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి
ప్రకాశం జిల్లా కొండేపి ఎమ్మెల్యే ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి మే 19వ తేదీ కొండేపి లోని సీతారామ కళ్యాణమండపంలో జరిగే కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ మారీటైం చైర్మన్ దామచర్ల సత్య హాజరవుతారని కార్యకర్తలు అందరూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉదయం 10 గంటల నుంచి ఈ సమావేశం ప్రారంభమవుతుందని మంత్రి స్వామి తెలిపారు.