కొండపి: జరుగుమల్లిలో జరిగిన స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి స్వామి
జరుగుమల్లిలో శనివారం జరిగిన స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో మంత్రి స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. వేసవి నేపథ్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు.ప్రజలు ఎక్కువగా నీరు, మజ్జిగ తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం పొలాల్లో నీటి తొట్లను ఏర్పాటు చేసి పశువులకు నీరు అందిస్తోందని మంత్రి తెలిపారు.