కొండపి: అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, పెన్షన్లు అందించాలి: సిబ్బందికి సూచనలు ఇచ్చిన కొండపి ఎంపీడీవో రామంజనేయులు
ప్రకాశం జిల్లా కొండపి మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ ముగిసిన అనంతరం శనివారం ఎంపీడీవో రామాంజనేయులు సిబ్బందికి కీలక సూచనలు సలహాలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన రేషన్ కార్డులు మరియు పెన్షన్లు పంపిణీ కార్యక్రమానికి సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరిని గుర్తించి వారికి పెన్షన్లు, రేషన్ కార్డులు అందించాలని ఎంపీడీవో రామాంజనేయులు సిబ్బందికి సూచనలు సలహాలు ఇచ్చారు.