కొండపి: కొండేపి ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో రామాంజనేయులు ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహణ
కొండపి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కొండేపి మండల సర్వసభ్య సమావేశంను శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధాన అంశాలుగా కొత్త రేషన్ కార్డులు,జాతీయ ఉపాధి పనికి సంబంధించి నూతన జాబ్ కార్డులు,అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకి ఎంపీటీసీలు,జడ్పీటీసీలు ప్రెసిడెంట్లు,వార్డు నెంబర్లు విజ్ఞప్తి చేశారు.అర్హులైన ప్రతి ఒక్కరికి త్వరలోనే రేషన్ కార్డులు పెన్షన్లు అందిస్తామని ఎంపీడీవో రామాంజనేయులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో మురళి పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.