కొండపి: టంగుటూరు మండలం జయవరం గ్రామంలో ఉపాధి హామీ నిధులతో నిర్మించిన నీటి తొట్టెలను ప్రారంభించిన కలెక్టర్
టంగుటూరు మండలంలోని జయవరం గ్రామంలో ఉపాధి హామీ నిధులతో పశువుల దాహార్తించేందుకు నిర్మించిన నీటి తొట్టెలను ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయా గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వేసవిలో మూగజీవాల దాహాన్ని తీర్చేందుకు ఉపాధి హామీ నిధులతో గ్రామీణ ప్రాంతాలలో నీటి తొట్టెలను నిర్మించడం జరిగిందని వాటిని పశుపోషకులు సద్వినియోగం చేసుకొవాలని తెలిపారు.