కొండపి: కొండపి నియోజకవర్గంలో బీసీ మహిళలకు ఇస్తున్న కుట్టుమిషన్లు నాసిరకంగా ఉన్నాయి : వైసీపీ జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు వసంత్
కొండపి నియోజకవర్గంలో బీసీ మహిళలకు ఇస్తున్న కుట్టుమిషన్లు నాసిరకంగా ఉన్నాయని ప్రకాశం జిల్లా వైసీపీ బీసీ సెల్ అధ్యక్షుడు వసంత్ ఆరోపించారు. ఈ సందర్భంగా కొండేపి మండల కేంద్రంలో బీసీ మహిళలకు జరుగుతున్న శిక్షణ తరగతులను మంగళవారం ఆయన పరిశీలించారు. ఒక్కో మహిళకు శిక్షణ, కుట్టుమిషన్ కోసం ప్రభుత్వం రూ.23 వేలు కేటాయిస్తే కాంట్రాక్టర్ కేవలం రూ.7 వేలు మాత్రమే ఖర్చు చేస్తున్నారని ఆయన విమర్శించారు.