కొండపి: టంగుటూరు మండలం జయవరం గ్రామంలో ఉపాధి హామీ పనులను తనిఖీ చేసిన కలెక్టర్ అన్సారియా
టంగుటూరు మండలంలోని జయవరం గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ప్రకాశం జిల్లా కలెక్టర్ అన్సారీయా ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలతో ఆమె మాట్లాడి వారి యొక్క ఇబ్బందులను తెలుసుకున్నారు. మీ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధి హామీ పనులను పకడ్బందీగా నిర్వహించాలని మస్టర్ల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.అవకతవలకు పాలుపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా ఉపాధి హామీ కూలీలకు అవసరమైన కనీస సౌకర్యాలను ఏర్పాటు చేయాలని తెలిపారు.