కొండపి: కొండపి వేలంలో మూడోవంతు పొగాకు బేళ్ల తిరస్కరణ: వేలం నిర్వహణ అధికారి సునీల్ కుమార్
కొండపి పొగాకు వేలం కేంద్రంలో బుధవారం జరిగిన వేలంలో మూడోవంతు బేళ్లు తిరస్కరణకు గురయ్యాయని వేలం నిర్వహణ అధికారి సునీల్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..1268 బేళ్లు అమ్మకానికి రాగా, 839 మాత్రమే కొనుగోలు చేశారు. అదేవిధంగా జువ్విగుంట, తంగెళ్ల ప్రాంతాల నాణ్యమైన ఎర్రనేల పొగాకును ప్రైవేట్ కొనుగోలుదారులు తిరస్కరించారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.