కొండపి: పొన్నలూరులో వాహనదారులకు కౌన్సెలింగ్ నిర్వహించిన కనిగిరి డిఎస్పి సాయి యశ్వంత్ ఈశ్వర్
పొన్నలూరు సెంటర్లో బుధవారం కనిగిరి డీఎస్పీ సాయి యశ్వంత్ ఈశ్వర్ వాహనదారులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. వాహనదారులు నిబంధనల ప్రకారం హెల్మెట్, లైసెన్స్ కలిగి వాహనాలపై ప్రయాణించాలన్నారు. వాహనదారులు తప్పనిసరిగా ధ్రువీకరణ పత్రాలను కలిగి ఉండాలని అన్నారు. మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ అనూక్ సిబ్బంది పాల్గొన్నారు.