శ్రీశైలం: శ్రీశైలం జలాశయాన్ని పరిశీలించిన కేంద్ర జల సంఘం బృందం
శ్రీశైలం జలాశయాన్ని కేంద్ర జల సంఘం బృందం పరిశీలించింది. కేంద్ర జల సంఘం ఎక్స్‌అఫీషియో అదనపు కార్యదర్శి యోగేష్ పైతాంకర్‌తో పాటు మరో ఇద్దరు అధికారులు శ్రీశైలం జలాశయానికి చేరుకున్నారు. జలాశయ పరిధిలోని రేడియల్ గేట్లు, నీటి మట్టాలు, గ్యాలరీలు, జలవిద్యుత్ కేంద్రాన్ని కేంద్ర జల సంఘం సభ్యులు పరిశీలించారు. అనంతరం జలాశయానికి సంబంధించిన పలు అంశాలపై అక్కడి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. జలాశయంలో నీటి పరిస్థితులు, జలాశయ నిర్వహణ, నీటి మట్టాలు తదితర అంశాలను కేంద్ర జల సంఘం బృందం క్షుణ్ణంగా పరిశీలించారు.