ఉరవకొండ: గ్రామాల్లో రైతన్న మీకోసం వారోత్సవాలు
నియోజకవర్గంలోని మండలాల్లో రైతు సేవా కేంద్రాల ఆధ్వర్యంలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహిస్తున్నారు. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలంలో రైతు సేవా కేంద్రాల్లో ఈ రైతన్న మీకోసం వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా మంగళవారం వ్యవసాయ మరియు అనుబంధ శాఖల అధికారులు పాల్గొని ఇంటింటికి వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు తెలిపిన పంచ సూత్రాలు అనగా నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం నుంచి మద్దతు ధర, ప్రకృతి వ్యవసాయం, రాబోయే ఖరీఫ్ సీజన్కు సంబంధించి రైతులకు వివరించడం జరుగుతోందని ఏవో పృథ్వి సాగర్ పేర్కొన్నారు.