కొడకండ్ల: జనగామ జిల్లా కొడకండ్ల రైతు వేదికలో రైతులకు అవగాహన కార్యక్రమం
జనగామ జిల్లా కొడకండ్ల రైతు వేదికలో ఆత్మ (ATMA) ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భూసార పరీక్షలు చేయించుకుని, నేల స్వభావానికి అనుగుణంగా ఆరుతడి పంటలు సాగు చేయాలని డాక్టర్ లక్ష్మణ్ సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు.