నర్సంపేట: కొడకండ్ల: 18.1 అడుగులకు చేరిన పాకాల సరస్సు ఖానాపూర్ మండలంలోని పాకాల సరస్సులోకి వరద నీరు వచ్చి చేరుతోంది.
*18.1 అడుగులకు చేరిన పాకాల సరస్సు* వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని పాకాల సరస్సులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. గత రెండు రోజులుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు సరస్సులోకి క్రమంగా వరద వస్తోంది. వారం క్రితం వరకు పాకాల సరస్సులో 17.6 అడుగుల నీరు ఉండేది. బుధవారం 18.1 అడుగులకు చేరుకుంది. పాకాల కింద సుమారు 20 వేలకు పైగా ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ వర్షాలకు ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.