కనిగిరి: టిడిపి బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలి: కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి: గ్రామాల్లో టిడిపి బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సూచించారు. కనిగిరి పట్టణంలోని టిడిపి కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి గురువారం పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డిని నాయకులు, కార్యకర్తలు కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... టిడిపి బలోపేతానికి బూత్, క్లస్టర్, యూనిట్ ఇన్చార్జిల్ గా నియమితులైన వారు కృషి చేయాలి అన్నారు. పార్టీ అధికారంలో ఉన్నందున ప్రజలకు ఆశలు ఎక్కువగా ఉంటాయని, వారి ఆశలకు అనుగుణంగా పనిచేయాలన్నారు.. గ్రామాల్లో సమస్యలు పరిష్కారం కాకుంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలన్నారు.