కనిగిరి: మార్కాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసి కనిగిరిలో ఫ్లోరైడ్ సమస్యను వివరించిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి: జలజీవన్ మిషన్ పనులను ప్రారంభించేందుకు మార్కాపురం వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కనిగిరి నియోజకవర్గంలో ఫ్లోరైడ్ నీటిని తాగడం వల్ల కిడ్నీ తదితర జబ్బులతో ప్రజలు బాధపడుతున్నారని డిప్యూటీ సీఎంకు ఎమ్మెల్యే వివరించారు. సురక్షిత మంచినీటి పథకం కేటాయించి, ఇంటింటికి కొలాయిల ద్వారా సాగర్ నీటిని సరఫరా చేసేందుకు నిధులు కేటాయించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి కోరారు.