అశ్వారావుపేట: అశ్వారావుపేటలో వెంకమ్మ చెరువు గండిని పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
మురసు తుఫాన్ ప్రభావంతో అశ్వారావుపేటలో జరిగిన నష్టాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. వెంకమ్మ చెరువు గండిని, దెబ్బతిన్న పంటలు, రహదారులను చూసి, నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.